Saturday, June 12, 2010

కొమ్ములొచ్చిన దొరతనానికి
బెండు తీయవచ్చిన నక్సలిజం
కాపుకాసి... మాటువేసి
సమరవీరుల అమరవీరుల చేస్తుంటే
తెలియకుందే ఏది నిజం...
లాల్ సలాం మీ నినాదం
ఎందుకాయెను నెత్తుటి గులాం
ఏ దశలో మారింది
మీ ఉనికి తెలుపు ఈ నైజం
ఏమాయెను మీ క్రాంతి సూత్రం
అన్నలకై వేచే ఆర్తులకు
చేరేనా ఈ చేదు నిజం....... !!
-------------------------------శ్రీ హర్ష
సరిగా లేననా
సరి కాలేననా
సిరి కలలేననా
సిరి కళ లేదనా
ఏమని తెలుపవేమని

కనుల సడి విని
చేరాను నీ సరసనీ
మనసు ఒడి చేరి
నీ పెదవి తడి కోరనీ
కోరిన నీ మనసునీ
చేరితే మన మనువనీ
నీవే నా సగమనీ
కనవే ఓ కన్యామణి !!!
--------------------శ్రీ హర్ష
గోడ మీది బల్లి,
    చేయకే లొల్లి
ఉలిక్కిపడి బుల్లి,
    అరిచింది లౌడ్లీ
అది విని సడన్లీ,
    జారింది నా చేతిలో ఇడ్లీ
రిపీటైతే మళ్లీ,
    నీ పరిస్థితి డెడ్లీ
ఇట్లు యువర్స్ మర్డర్లీ,
    బుల్లీస్ లవింగ్లీ .....

------------------------------శ్రీ హర్ష

Friday, June 04, 2010

ప్రేమను పొందుట మనసుతనం
ప్రేమను పంచుట మనిషితనం
ఇది నేర్వని ఓ యువతరం
ఎటు సాగెను మీ ప్రస్థానం?
------------------------------శ్రీ హర్ష

Wednesday, May 05, 2010

ఓ గాంధీ...
నిను అనుసరించువారు కల్ల, అనుకరించువారు కోకొల్ల
నీకు నిలయం ప్రతీ గల్లీ, కానీ నీ నిండా దుమ్ము ధూళి
నేటి నాయకులను చూస్తే వెరీ కీన్లీ
విషయాలు చాలా సిల్లీ, కానీ చేస్తారు పెద్ద లొల్లి
పోయావు వెరీ ఎర్లి, లేకపోతే అయ్యేది నీకూ పెళ్ళి
భారతావని నా తల్లి, రోదిస్తోంది తల్లడిల్లి!!!!
--------------------------------------------శ్రీ హర్ష
నా ఊహలకు ఆజ్యం పోసి
నా మనసుకు వలలను వేసి
నా కలలకు ప్రాణం పోసిన
ఓ చిలకమ్మా...
నిను వర్ణించే పదం కరువాయెనమ్మా
నను చేరి మనసు కలపవమ్మా
నే భరించుటకు ఒప్పుకొనవమ్మా!!!
---------------------------------శ్రీ హర్ష
ఓ మధురానగరిలో మణిపూస
నిను చేరాలని నా ఆశ
నీపై వీడదు నా ధ్యాస
నే విడిచే వరకు తుది శ్వాస !!!
---------------------------శ్రీ హర్ష
డబ్బని లవ్ డబ్బని నీ గుండె కొట్టుకుందా
పబ్బనే ఓ జబ్బునే తన వెంట తెచ్చుకుందా
తగ్గనీ ఓ పెగ్గునే నీ నోట వేయమందా
మబ్బని చదువబ్బని చవటల్లో కలుపుకుందా
ఒప్పుని, ఇది తప్పని ఇకనైన తెలుసుకోరా!!!!
--------------------------------------శ్రీ హర్ష

Monday, April 26, 2010

ఎంతమందిని ఎంచినా
నా ప్రేమను పంచునా
నీ పొందుకే ఈ యాచన
చేరరావే నా పంచన
నా మదిన కూడిన చింతన
ఈ ఎడబాటుకు సూచన
నీ మదికి వేసిన వంతెన
కాంచవే ఓ కాంచన!!!!
---------------------------శ్రీ హర్ష

Sunday, April 25, 2010

మెల్లంగ చిరుగాలి నీ చెక్కిలి నిమరగా
సల్లంగ చిరుజల్లు నీ మేని తాకగా
వేగంగ నా తలపు నీ మది చేరదే?
కమ్మంగ నీ ముద్దు నా పెదవి చేరదే??
----------------------------------- శ్రీ హర్ష

Saturday, April 17, 2010

సత్యమే ఆనందం అన్నవాడు, రతి ఆనందం కోరే
కల్కి నేన్నవాడు, కలికి చేదోడుగా చేరే
కాసు ఉంటే, పాపమైనా రామరామ హరేహరే
వీరిని నమ్మినవాడు, ఎవడికివాడు యమునా తీరే !!!
------------------------------------------ శ్రీ హర్ష

Sunday, April 11, 2010

పాశ్చాత్యుల పరుగులెత్తించిన వీరత్వం
నా నేలకు తెచ్చెను స్వాతంత్ర్యం
ఈ దేశ చరిత్రకు వచ్చెను విజయ గర్వం
పొట్టలు పెంచిన నాయకులతో మొదలాయెను
పూట గడవని వాని పొట్ట కొట్టే వారసత్వం
ఓ కాలమా, నీ పుటలో వీరికో స్థానమా??
పురాణ పురుషుల పక్క చేరే యోగం
ఈ పుట్ట చీమలకో వరమా ??
నా భావి తరాల ధౌర్భాగ్యమా?????
----------------------------- శ్రీ హర్ష

Sunday, April 04, 2010

నీకై వెదికాను గతమంతా
నిన్నే తలచాను రోజంతా
నీ చూపుకే మైమరచి ఒకింత
నే వాలినాను నీ చెంత
నీవే నిండినావు నా మనసంతా
ఓ సమంతా....
నువ్వు కోరితే అంకితం జన్మంతా!!!
----------------------------- శ్రీ హర్ష

Saturday, April 03, 2010

మనసు మరుగున పడిన భావాలు
ఉవ్వెత్తున ఎగసెను నేడు
నిను చేరే దారిలో నీడలైన ఙ్నాపకాలు
ఊరకుండక రేపిన అలజడి చూడు...
------------------------------------ శ్రీ హర్ష
ఆనందాల నదులు కడలి గడప తడుతుంటే
కష్టాల కడలిలో మునిగిన ఓ మానవుడా
నీ కన్నీటి జలపాతాలకు వేయి ఇక కళ్ళెం
ఆనందం ఆస్వాదించుటకు వెతకు ఓ మార్గం
-------------------------------------- శ్రీ హర్ష
నిను కన్న నాడు మనసే మూగబోయింది
నీ కన్న నేడు సరి జోడు లేదంది
తన ఊహలకే ప్రాణం నీవంది
మది గదిలో దాగిన నీకే ఈ జననం అంకితమంది
----------------------------------------- శ్రీ హర్ష
నీ తలపులు నా మది తలుపులు తడుతుంటే
వేచి ఉండుట నా తరమా
ఎద చేరి నీవు గిలిగింతలు పెడుతుంటే
ఆ కవ్వింతలనాపతరమా
కనులు మూసినా నీవు కానరాకుంటే
నీ సొగసుచూడతరమా.....
-------------------------------------- శ్రీ హర్ష
అలమేలు చేసెనేమో అలనాడు మేలు
జగమేలు వాడు జగము మేలు చూసెనా
మిమ్మేలు వాడు మీ మేలు చూడడు
మేలు కొనే ముందే మేలుకొనర సోదరా
కష్టించి నీవే ఓ దరి చేరుకోరా!!!!

--------------------------------- శ్రీ హర్ష

Wednesday, March 10, 2010

తరగతిలో పురోగతి
బయటకు వస్తే అదోగతి
పాఠం చెప్పెను నీతి
ప్రపంచం చూపెను అవినీతి
నీది కాని నిధి
కోరెను నీ సన్నిధి
ఎంచుకొనుట నీ వంతు
ఫలితం తరువాతి తంతు

పరిధి లేని ప్రగతి
అంతు లేని ఆశ
తరుగు లేని వివేకం
దరి చూపని నీ దారి
చూస్తాయి నీ అంతు
ఎంచుకొనుట నీ వంతు
ఫలితం తరువాతి తంతు
--------------------------------------శ్రీ హర్ష

Monday, March 01, 2010

చిత్రంగా ఉందే నీ చిత్రం చూస్తుంటే
చిత్రంగా ఉందే నా పక్క నీవుంటే
నా మదిలో చేరిన తార
ఏం మాయ చేసావే ఓ సితార
--------------------------------------------శ్రీ హర్ష

Saturday, February 13, 2010

'ప్రే'యసి ''నసా 'కు'శలమా
నా 'ప్రే'యసి ''నసు 'తో'డడిగిన
రోజు
ప్రేమికుల రోజు
--------------------------------------------శ్రీ హర్ష

Friday, January 22, 2010

నా లక్కు మారి సుకుమారి
దిల్ లోన దూరి చేసింది చోరి
నా ఎదుట చేరి నవ్వింది ప్రతీసారి
కాచాను దారి, పడ్డాను దాని వెనకే మరి
దాని అన్న గిరి చేస్తాడు దాదాగిరి
ఇచ్చాడు ఒక్కటి మూతి మీద మరి
దానితో అయ్యింది నా ఫేసు పూరి
చెప్పాను సారి, మనసయ్యింది భారీ
నా మంచి కోరి, నా ఫ్రెండు సూరి
ఆనక చెప్పాడు మిస్టరీ
"ఓరి చారి అది పిచ్చి పోరి"!!!!
-------------------------------------శ్రీ హర్ష