తెలంగాణ ఉద్యమెత్తి
తెలుగు తల్లి ఉసురు తీసి
తెలివితేటల కాల రాసి
మూర్ఖులై .... మూఢులై...
వెలుగు వెతికి వెంబడించాల్సిన విద్యార్థు లారా
కానరని చీకట్ల లో కాటువేసే సర్పాలకు బలి కాకండి
ప్ర గతి పథానికి ప్ర థమ జ్యోతి కావలసిన మీరు
తెలుగు జాతి భవితకు చరమగీతం పాడకండి
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
చెంతనున్నవరకు చింతలేదు
వీడిపోతే విలువలేదు
ఏకం చెంతనే ఉన్నది సూన్యం
ఐక్యతలోనే ఉన్నది బలం
ఆర్థి క మాంద్యానికి వెనుకడుగు వేశాం
బుద్ధి మాంద్యంతో వెనుకకే పయనించకండి
తెలుగు జాతి భవితకు చరమగీతం పాడకండి
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది !!!
--------------------------------------------------శ్రీ హర్ష
--------------------------------------------------శ్రీ హర్ష