Wednesday, August 24, 2011


శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే
ఎవరి ఆజ్ఞతో జరిగేను ఇన్ని అమానుషాలు
ఎవడు గీసిన గీతకి ఎవడు బాధ్యుదు?
జరుగుతున్న పాపాలకి ఎవడూ శిక్షార్హుడు?
అందుకే...
ఎవడు ఆడే ఆటలో ఎవడు పావో తెలుసుకో
నీవు మెచ్చిన రీతిలో గీత నీవే మార్చుకో!!
------------------------------------------- శ్రీ హర్ష 


కల్మషం ఎరుగని ఆ స్నేహం బాల్యం నాకు చూపింది
చిలిపితనపు ఆ స్నేహం కౌమరం నాకు ఇచ్చింది
తోడు నిలుచు ఆ స్నేహం యవ్వనం నాకు పంచింది
మనసు పంచు ఆ స్నేహం ఆశ గానే మిగిలి ఉంది....
-------------------------------------------------- శ్రీ హర్ష

Wednesday, July 06, 2011

సీటుకు ఎక్కడ వస్తుందో అని పోటు
ఓటుకు విలువ కట్టింది నోటు
పాలించే వాడికి సై అంటూ
విర్రవీగింది పోలీసు బూటు
ప్రసార భారతి అయ్యింది
ఈ నాటకాలకు వారధి
ఎవరు కట్టాలి ఈ ఆగడాలను సమాధి???
------------------------------------------- శ్రీ హర్ష

Sunday, June 12, 2011

నా కనులలో కనులు కలిపి
నా ఊహలకే సంకెళలేస్తివే
నీ ఎద కౌగిట హత్తుకుని
నా ఎద సడిని మార్చితివే
నా పెదవికి పెదవి కలిపి
నా మాటలనే మట్టుపెడితివే
నీ మనసు తెలిపి
నా మనసునే దోచితివే
నా లోకమే నీది చేసుకొని
నను ఏల వచ్చిన రాణివి నీవే!!!!
------------------------------- శ్రీ హర్ష

Monday, March 28, 2011

ఎన్నాళ్లో ఓపిక పట్టి
ధైర్యానికి సాహసం జత కట్టి
నీ ఎద గది తలుపులు తట్టి
అందించా నా ప్రేమ చీటీ
అందులోని తప్పులు లెక్కకట్టి
చంపకు నన్ను మొట్టి
ఆపై ఏడవాలి తల బొప్పి కట్టి
నువ్వు సై అంటే సాగుదాం జోడు కట్టి
లేకుంటే చెప్పు చూసుకుంటా ఇంకో బ్యూటీ
---------------------------------------------శ్రీ హర్ష

గుండె చేసే చప్పుడు శ్వాస చెబుతుంటే
మనసు పలికే భావం కనులు చూపుతుంటే
చేర రావేమే సఖి ఏలుకోవేమే?
వేగి రావేమే చెలీ
జోడు కావేమే??
-------------------------------శ్రీ హర్ష

Friday, March 25, 2011

నిను చేరే దారినే సెలవిమ్మంటు
నిను తాకే గాలినే నే వేడుకున్నా
నీ తోడే ఉండే ఆ కిటుకేమిటో
నిను వీడని కాంతినే నే కనుక్కున్నా
నిను ఏలుకొన రాజునై నే వస్తున్నా
కార్యార్థినై కొల్లగొట్ట నీ సొగసు ఖజానా!!
-------------------------------శ్రీ హర్ష