Monday, April 26, 2010

ఎంతమందిని ఎంచినా
నా ప్రేమను పంచునా
నీ పొందుకే ఈ యాచన
చేరరావే నా పంచన
నా మదిన కూడిన చింతన
ఈ ఎడబాటుకు సూచన
నీ మదికి వేసిన వంతెన
కాంచవే ఓ కాంచన!!!!
---------------------------శ్రీ హర్ష

Sunday, April 25, 2010

మెల్లంగ చిరుగాలి నీ చెక్కిలి నిమరగా
సల్లంగ చిరుజల్లు నీ మేని తాకగా
వేగంగ నా తలపు నీ మది చేరదే?
కమ్మంగ నీ ముద్దు నా పెదవి చేరదే??
----------------------------------- శ్రీ హర్ష

Saturday, April 17, 2010

సత్యమే ఆనందం అన్నవాడు, రతి ఆనందం కోరే
కల్కి నేన్నవాడు, కలికి చేదోడుగా చేరే
కాసు ఉంటే, పాపమైనా రామరామ హరేహరే
వీరిని నమ్మినవాడు, ఎవడికివాడు యమునా తీరే !!!
------------------------------------------ శ్రీ హర్ష

Sunday, April 11, 2010

పాశ్చాత్యుల పరుగులెత్తించిన వీరత్వం
నా నేలకు తెచ్చెను స్వాతంత్ర్యం
ఈ దేశ చరిత్రకు వచ్చెను విజయ గర్వం
పొట్టలు పెంచిన నాయకులతో మొదలాయెను
పూట గడవని వాని పొట్ట కొట్టే వారసత్వం
ఓ కాలమా, నీ పుటలో వీరికో స్థానమా??
పురాణ పురుషుల పక్క చేరే యోగం
ఈ పుట్ట చీమలకో వరమా ??
నా భావి తరాల ధౌర్భాగ్యమా?????
----------------------------- శ్రీ హర్ష

Sunday, April 04, 2010

నీకై వెదికాను గతమంతా
నిన్నే తలచాను రోజంతా
నీ చూపుకే మైమరచి ఒకింత
నే వాలినాను నీ చెంత
నీవే నిండినావు నా మనసంతా
ఓ సమంతా....
నువ్వు కోరితే అంకితం జన్మంతా!!!
----------------------------- శ్రీ హర్ష

Saturday, April 03, 2010

మనసు మరుగున పడిన భావాలు
ఉవ్వెత్తున ఎగసెను నేడు
నిను చేరే దారిలో నీడలైన ఙ్నాపకాలు
ఊరకుండక రేపిన అలజడి చూడు...
------------------------------------ శ్రీ హర్ష
ఆనందాల నదులు కడలి గడప తడుతుంటే
కష్టాల కడలిలో మునిగిన ఓ మానవుడా
నీ కన్నీటి జలపాతాలకు వేయి ఇక కళ్ళెం
ఆనందం ఆస్వాదించుటకు వెతకు ఓ మార్గం
-------------------------------------- శ్రీ హర్ష
నిను కన్న నాడు మనసే మూగబోయింది
నీ కన్న నేడు సరి జోడు లేదంది
తన ఊహలకే ప్రాణం నీవంది
మది గదిలో దాగిన నీకే ఈ జననం అంకితమంది
----------------------------------------- శ్రీ హర్ష
నీ తలపులు నా మది తలుపులు తడుతుంటే
వేచి ఉండుట నా తరమా
ఎద చేరి నీవు గిలిగింతలు పెడుతుంటే
ఆ కవ్వింతలనాపతరమా
కనులు మూసినా నీవు కానరాకుంటే
నీ సొగసుచూడతరమా.....
-------------------------------------- శ్రీ హర్ష
అలమేలు చేసెనేమో అలనాడు మేలు
జగమేలు వాడు జగము మేలు చూసెనా
మిమ్మేలు వాడు మీ మేలు చూడడు
మేలు కొనే ముందే మేలుకొనర సోదరా
కష్టించి నీవే ఓ దరి చేరుకోరా!!!!

--------------------------------- శ్రీ హర్ష