Friday, December 25, 2009

ఓ విద్యార్థీ

తెలంగాణ ఉద్యమెత్తి
తెలుగు తల్లి ఉసురు తీసి
తెలివితేటల కాల రాసి
మూర్ఖులై .... మూఢులై...
వెలుగు వెతికి వెంబడించాల్సిన విద్యార్థు లారా
కానరని చీకట్ల లో కాటువేసే సర్పాలకు బలి కాకండి
ప్ర గతి పథానికి ప్ర థమ జ్యోతి కావలసిన మీరు
తెలుగు జాతి భవితకు చరమగీతం పాడకండి
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

చెంతనున్నవరకు చింతలేదు
వీడిపోతే విలువలేదు
ఏకం చెంతనే ఉన్నది సూన్యం
ఐక్యతలోనే ఉన్నది బలం
ఆర్థి క మాంద్యానికి వెనుకడుగు వేశాం
బుద్ధి మాంద్యంతో వెనుకకే పయనించకండి
తెలుగు జాతి భవితకు చరమగీతం పాడకండి
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది !!!
--------------------------------------------------శ్రీ హర్ష

Sunday, July 26, 2009

నీకై పరితపన ఎవరికి ఎరుక
నన్ను వదిలి నిను చేరిన నా నీడకు తప్ప
నీపై ఉన్న ప్రేమకు ఏమి చుపగలను సాక్ష్యం
నాలో ఉన్న నిన్ను తప్ప
నాకై వేచి ఉన్న నీకు ఏమి ఇవ్వగలను
నీకై వెదుకుతున్న నన్ను తప్ప
----------------------------------------
-- శ్రీ హర్ష

Saturday, March 28, 2009

నీ మనసు గెలిచిన క్షణం, ఏమి చేయను మరో క్షణం
ఇంతవరకు ప్రతిక్షణం , ఇందుకొరకే నిరీక్షణం
....
-------------------------------------------------శ్రీ హర్ష
రెక్కలు వచ్చిన నా స్వప్నం , ఎందాకే నీ పయనం

కనులు చూసే రేపటికి, ఆగనివ్వకు ఆ గమనం

అలుపు రానివ్వకు ఆ రెక్కలకు

మనసు చూసిన రేపటిని నే చేరుకునేవరకు...
.

--------------------------------------------------శ్రీ హర్ష